News September 30, 2024

దసరాకు 758 ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా APSRTC కడప జోన్ పరిధిలోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 758 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సర్వీసులు అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు అన్నారు.

Similar News

News October 14, 2024

నంద్యాలలో నూతన బస్సులు ప్రారంభించిన ఎంపీ

image

ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమని, ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని మంత్రి ఫరూక్ అన్నారు. సోమవారం ఆయన నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో నూతన బస్సులను ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రారంభించారు. నంద్యాలకు నూతనంగా ఏర్పాటు చేసిన బస్సులను ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News October 14, 2024

నంద్యాల: మద్యం దరఖాస్తుల ద్వారా రూ.40.42 కోట్లు ఆదాయం

image

నంద్యాల జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా, ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపు పూర్తయింది. దరఖాస్తుల ద్వారా రూ.40.42కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆమె వెల్లడించారు.

News October 14, 2024

జ్వరంతో కొడుకు మృతి.. విషాదంలో తల్లి

image

ఆస్పరికి చెందిన శివ(16) జ్వరంతో మృతిచెందాడు. తల్లి మహేశ్వరి హోటల్ నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. శివకు జ్వరం రావడంతో శనివారం ఆదోనిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. భర్త భీమేష్ 2018లో అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబానికి ఆధారమైన భర్త, కొడుకు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.