News September 30, 2024
దసరాకు 758 ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా APSRTC కడప జోన్ పరిధిలోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 758 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సర్వీసులు అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు అన్నారు.
Similar News
News October 7, 2024
అలంపూర్ మా అమ్మమ్మగారి ఊరు: కర్నూలు కలెక్టర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ జోగులాంబ శ్రీబాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు ఆదివారం కర్నూలు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంపూర్ తన అమ్మమ్మగారి ఊరని, సెలవుల్లో ఇక్కడికి వచ్చి గడిపే వాళ్ళమని. అలంపూర్‌తో తనకున్న జ్ఞాపకాలను కలెక్టర్ నెమరేసుకున్నారు.
News October 7, 2024
శ్రీశైల మల్లన్న క్షేత్రం.. పుష్ప శోభితం!
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉభయ ఆలయాల ప్రధాన ధ్వజస్తంభాలు, ఉపాలయాలను, ముఖద్వారా లను వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన రకరకాల పూలతో స్వామి అమ్మవార్ల ప్రతిబింబాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పుష్పాలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
News October 6, 2024
కర్నూలు: టెట్ పరీక్షకు 256 మంది గైర్హాజరు
కర్నూలు జిల్లాలో ఆదివారం టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ వెల్లడించారు. పరీక్షకు మొత్తం 2,435 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 256 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. టెట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినట్లు తెలిపారు.