News October 4, 2024
దసరా పండుగకు 6000 ప్రత్యేక బస్సులు
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్ళే ప్రయాణీకులకు ఇబ్బంది కలుగకుండా TGRTC 6000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని కూకట్పల్లి ఆర్టీసీ డిపో డీఎం హరి తెలిపారు. రద్దీకి అనుగుణంగా జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి ప్రాంతాల నుంచి కరీంనగర్, నిజామాబాద్, హనుమకొండ, వరంగల్, MBNR, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, కర్నూల్, అనంతపురం ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు డీఎం స్పష్టం చేశారు.
Similar News
News November 12, 2024
HYD: 15 వేల మంది విద్యార్థులతో ప్రోగ్రాం: సీఎం
HYDలో నవంబర్ 14న చిల్డ్రన్స్ డే రోజు దాదాపుగా 15,000 మంది విద్యార్థులతో భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాల ప్రాజెక్టును ప్రకటించడంతో పాటు, పూర్తి వివరాలు వివరించనున్నట్లు సెక్రటేరియట్లో పేర్కొన్నారు. 20-25 ఎకరాల్లో 2,500 మంది విద్యార్థుల కెపాసిటీతో గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
News November 12, 2024
HYD: ‘కుల సర్వేలో ఎస్సీ మాదిగ 31ను మెన్షన్ చేయండి’
కుల సర్వేలో ఎస్సీ మాదిగ 31ను మెన్షన్ చేయాలని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నరసింహ అన్నారు. ఎన్యూమరేటర్లు సర్వే వివరాలు నింపుతున్న ఫామ్‌లో ఎస్సీ మాదిగ అని మెన్షన్ చేస్తూ, మాదిగ కోడ్ 31గా నమోదు చేసుకోవాలని తెలిపారు. కోడ్‌ను నమోదు చేయని పక్షంలో మాదిగ కులాన్ని జనాభా లెక్కలు తక్కువ చూపిస్తూ, రావాల్సిన రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని, దీన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.
News November 12, 2024
HYD: రైల్ సేవల పట్ల ప్రయాణికుల హర్షం
సికింద్రాబాద్ నుంచి జ్యోతిర్లింగ భారత్ గౌరవ్ ట్రైన్ సేవల పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక ప్రాంతాలైన రామేశ్వరం, తిరువన్నామలై, కన్యాకుమారి, మధురై, తిరువనంతపురం లాంటి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించుకునే అవకాశం కల్పించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.