News October 12, 2024

దసరా వేడుకలు.. పంచ కట్టులో రేవంత్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తన సొంతూరు కొండారెడ్డిపల్లి గ్రామంలో శనివారం ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన గ్రామస్థులు, అభిమానులతో కలిసి జమ్మి చెట్టు వద్దకు కాలినడకగా వెళ్లారు. ఎంపీ మల్లు రవి, MLAలు, తన మనవడు, కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 6, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔GET READY..రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ✔11న కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ✔NRPT:చిరుతపులి దాడిలో మేకలు మృతి ✔MBNR:పీఎంశ్రీకి 119 పాఠశాలలు ఎంపిక ✔కడ్తాల్: మహిళ మృతదేహం లభ్యం ✔MBNR:ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ప్రారంభమైన రాజకీయ వేడి ✔GDWL:సెల్ ఫోన్ల రికవరీలో పోలీసుల ఉత్తమ ప్రతిభ ✔ప్రతి ఇంటిపై స్టిక్కర్లు అతికించాలి:కలెక్టర్లు ✔కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్:AITUC

News November 5, 2024

11న కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి 

image

పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి బ్రహ్మోత్సవాలు పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 11న కురుమూర్తికి రానున్నారు. సీఎం రాక కోసం మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా  కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు.

News November 5, 2024

అలంపూర్: అధికారిక చిహ్నం మార్పు.. కలెక్టర్ స్పష్టత

image

జోగులాంబ గద్వాల జిల్లా, కర్నూల్ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అలంపూర్ వద్ద ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గర అధికారులు పెట్టిన బారీకేడ్లపై అధికారిక చిహ్నం మార్పు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీనిపై జోగులాంబ కలెక్టర్ స్పందించారు. వెంటనే తప్పుడు లోగో ఉన్న బారీకేడ్లను తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు.