News March 27, 2025
దహెగాం: పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అనురాధ

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో సెంటర్కు వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని అనురాధ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన రాజయ్య బుధవారం ఉదయం చనిపోయారు. రాజయ్య కుమార్తె అనురాధ అదే బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసి అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొంది. ఆమె ఎంతో గ్రేట్ కదా..!
Similar News
News November 4, 2025
ఆదిలాబాద్: ‘బిల్లులు మంజూరు చేయకుంటే పనులు చేయలేం’

ప్రభుత్వ శాఖల్లో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు ఏళ్లుగా పేరుకుపోతున్నాయని బిల్లులు మంజూరు చేయకుంటే పనులు చేయలేమని బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాతోపాటు పంచాయతీ రాజ్ ఎస్ఈ జాదవ్ ప్రకాశ్కు వినతిపత్రం అందజేశారు. బిల్లులు రాకపోవడం మూలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని, మిగిలిన పనులు చేయలేని పరిస్థితి ఉందని వివరించారు.
News November 4, 2025
కంచరపాలెంలో 7న జాబ్ మేళా

కంచరపాలెంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 7న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 7 కంపెనీలు పాల్గొనున్నాయి. టెన్త్,ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివిన 18 నుంచి 33 సంవత్సరాలలోపు యువతీ, యువకులు అర్హులు. ఆసక్తి కలవారు https://www.ncs.gov.in, https://employment.ap.gov.in లో వివరాలు నమోదు చేసుకొని నవంబర్ 7న ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో హాజరు కావాలి.
News November 4, 2025
పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకూడదు: కలెక్టర్

పత్తి విక్రయానికి వచ్చే రైతులను జిన్నింగ్ మిల్లుల యాజమాన్యం, సీసీఐ అధికారులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదని కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో వ్యవసాయ, మార్కెటింగ్, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యంతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా, తేమ శాతం వంటి కారణాలతో వేధించవద్దని ఆయన ఆదేశించారు.


