News March 27, 2025

దహెగాం: పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అనురాధ

image

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో సెంటర్‌కు వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని అనురాధ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన రాజయ్య బుధవారం ఉదయం చనిపోయారు. రాజయ్య కుమార్తె అనురాధ అదే బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసి అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొంది. ఆమె ఎంతో గ్రేట్ కదా..!

Similar News

News September 17, 2025

ఆదిలాబాద్ జిల్లా వెదర్ అప్‌డేట్

image

ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8:30 గంటల వరకు కాస్త ఎడతెరిపినిచ్చాయి. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 13.8 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. జిల్లాలో అక్కడక్కడ చిరు జల్లులు మాత్రమే కురిశాయి. రైతులు వాతావరణ పరిస్థితులు గమనించి సాగు పనులు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.

News September 17, 2025

ADB: ‘చేయి’ కలుపుతారా.. కలిసి పనిచేస్తారా?

image

ADB జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సంజీవరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ ప్రధానకార్యదర్శి గండ్రత్ సుజాత పార్టీలో చేరడంతో ఓ వర్గం అసంతృప్తిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డితో కలిసి పనిచేస్తారా..? కలిస్తే లోకల్ పోరులో వీరి ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.

News September 16, 2025

ఆదిలాబాద్: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫలితాలు విడుదలైనట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జే సంగీత, వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. 2025 జూలై నెలలో రాసిన డిగ్రీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం ఈ https://braou.ac.in/result#gsc.tab=0 వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.