News March 27, 2025

దహెగాం: పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అనురాధ

image

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో సెంటర్‌కు వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని అనురాధ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన రాజయ్య బుధవారం ఉదయం చనిపోయారు. రాజయ్య కుమార్తె అనురాధ అదే బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసి అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొంది. ఆమె ఎంతో గ్రేట్ కదా..!

Similar News

News April 25, 2025

కుబీర్: ఇల్లరికం వచ్చి ప్రాణాలు తీసుకున్నాడు..!

image

అత్తారింటికి ఇల్లరికానికి వచ్చి భార్యతో గొడవపడి ఓ అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఉమ్రి గ్రామానికి చెందిన సురేశ్ కుబీర్ లోని అంతర్నీ గ్రామానికి చెందిన రోజాతో వివాహం జరిగింది. అయితే మంగళవారం భార్యాభర్తలు గొడవ పడ్డారు. భార్య బంధువుల ఇంటికి వెళ్లిపోవడంతో జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ తెలిపారు.

News April 25, 2025

భారత్ ఏం చేసినా మద్దతిస్తాం: ప్రపంచ నేతలు

image

పహల్‌గామ్ నరమేధానికి ప్రతీకారంగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తామని UK MP బాబ్ బ్లాక్‌మెన్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ మిలిటరీ యాక్షన్ చేపట్టినా తమ దేశంలోని పార్టీలన్నీ సపోర్ట్ చేస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ PM మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కష్టసమయంలో భారత్‌కు తమ దేశం అండగా ఉంటుందన్నారు.

News April 25, 2025

ప్రాతః కాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

image

నేడు శుక్రవారం సందర్భంగా ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారు ప్రాతః కాల విశేష దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా అలంకరణ చేసి వచ్చిన భక్తులకు విశేష పూజలు, హారతి ఇచ్చి భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందచేశారు. 

error: Content is protected !!