News March 27, 2025
దహెగాం: పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అనురాధ

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో సెంటర్‌కు వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని అనురాధ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన రాజయ్య బుధవారం ఉదయం చనిపోయారు. రాజయ్య కుమార్తె అనురాధ అదే బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసి అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొంది.
Similar News
News September 15, 2025
రాయలసీమ కోనసీమ అవుతోంది: సీఎం

AP: రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లాంటి విధానాలతో మంచి ఫలితాలు సాధించామని, ఇప్పుడది కోనసీమగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టిసీమతో డెల్టాలో వాడే కృష్ణానీటిని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగామని తెలిపారు. హంద్రీనీవా కాలువతో కుప్పం వరకూ కృష్ణా నీళ్లు తీసుకెళ్లామన్నారు. వాణిజ్య పంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలని కలెక్టర్లకు సూచించారు.
News September 15, 2025
పాక్‌పై గెలిచాక భార్యతో SKY సెలబ్రేషన్స్

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి హోటల్‌కు తిరిగి వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌కి తన భార్య దేవిషా శెట్టి నుంచి ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆయన బర్త్‌డే కావడంతో స్పెషల్ కేక్ కట్ చేయించారు. అంతేకాదు ఆయన నుదురుపై కేకు తిలకం దిద్దారు. దీనికి సంబంధించిన ఫొటోలను దేవిషా తన ఇన్‌స్టా అకౌంట్లో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే మై స్పెషల్ వన్’ అని రాసుకొచ్చారు.
News September 15, 2025
HYD: 435 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి డ్రంక్& డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 435 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 306 బైకులు, 30 త్రీవీలర్, 97 ఫోర్ వీలర్లు, 2 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.