News February 20, 2025

దాచేపల్లిలో పోలీస్ పహారా

image

దాచేపల్లిలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఒక వర్గం వారు ఊరేగింపు నిర్వహిస్తుండగా మరో వర్గం ఎదురుపడటంతో ఘర్షణ జరిగి ఇరువురు వ్యక్తులు గాయపడిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో దాచేపల్లి సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేశారు. గొడవలు పెరగకుండా ఇంతటితో పుల్‌స్టాప్ పెట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు

Similar News

News December 8, 2025

కామారెడ్డి: పోస్టల్ బ్యాలెట్ కౌంటర్‌ను పరిశీలించిన కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం దోమకొండలో పోస్టల్ బ్యాలెట్ కౌంటర్‌ను సందర్శించారు. ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకుంటున్న విధానాన్ని పరిశీలించి, ప్రక్రియ పారదర్శకంగా, సక్రమంగా కొనసాగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. జడ్పీ సీఈవో చందర్, ఆర్డీఓ వీణ పాల్గొన్నారు.

News December 8, 2025

IIIT-నాగపుర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

image

IIIT-నాగపుర్‌ 6 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్ , పీహెచ్‌డీ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం పీహెచ్‌డీ ఉన్నవారికి రూ.65వేలు, మిగతావారికి రూ.60వేలు చెల్లిస్తారు. దరఖాస్తు చేసిన తర్వాత కాపీని recruitment@iiitn.ac.in ఈమెయిల్‌కు పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iiitn.ac.in.

News December 8, 2025

శ్రీకాకుళం: ‘ధాన్యాన్ని అధనంగా తీసుకుంటున్నారు’

image

ధాన్యం కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాల వద్ద 3 నుంచి 5 కేజీలు అధనంగా రైతుల నుంచి మిల్లర్లు తీసుకుంటున్నారని ఏపీ రైతు సంఘం పీజీఆర్ఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేసింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతి పత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని ప్రసాదరావు, చందర్రావు అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అధికారులు అమలు చేయాలని కోరారు.