News January 31, 2025

దాచేపల్లి: ముగ్గురు మైనర్ బాలుల మిస్సింగ్.. వీడిన మిస్టరీ

image

దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు బాలుర మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిన పిల్లల ఆచూకిని పోలీసులు సాంకేతిక సహకారంతో గుర్తించారు. ముగ్గురు మైనర్ బాలురు ఇర్ల శ్రీనివాస్ రావు (15)మీసాల డేవిడ్ రాజు (15 ), చర్లపల్లి నగేశ్ కృష్ణ (15) ఇంటి నుంచి వెళ్లిపోయారు. దాచేపల్లి ఎస్ఐలు సౌందర్య రాజన్, పాపారావు పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు.

Similar News

News November 18, 2025

వరంగల్: చేపల పెంపకంలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

చేపల పెంపకంలో శిక్షణ పొందడానికి ఆసక్తి ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు. 18నుంచి 30 ఏళ్ల వయసు గల 7వతరగతి చదివిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 26లోగా 7వ తరగతి, కులం, బదిలీ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో దరఖాస్తులను జిల్లా మత్స్యశాఖ అధికారి, పెద్దమ్మ గడ్డ, ములుగు రోడ్డు, హనుమకొండ, PIN:506007 చిరునామాకు పంపాలన్నారు.

News November 18, 2025

ప్రకాశం ఎస్పీ మీకోసంకు 130 ఫిర్యాదులు.!

image

ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులు వారి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తంగా 130 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.

News November 18, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.