News June 20, 2024
దాచేపల్లి: రైలు కింద పడి వ్యక్తి మృతి

నడికుడి, పొందుగుల రైల్వే స్టేషన్ మధ్య గురువారం రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. అతని ముఖం గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. నలుపు రంగు ప్యాంట్ ధరించి వున్నాడు. కుడి చేతిపైన ఆంజనేయస్వామి బొమ్మ పచ్చబొట్టు ఉంది. మృతుడి బంధువులు నడికుడి పోలీసులను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
Similar News
News October 24, 2025
అధికారుల నిర్లక్ష్యమా.. లేక విద్యార్థులపై చిన్న చూపా.?

గత 14 నెలలుగా నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక అధికారుల తీరు మారటం లేదు. ఈ నెల 13న MSC కెమిస్ట్రీ 2వ సెమిస్టర్ ఫలితాలను ప్రకటించిన వర్సిటీ అధికారులు, 23న రీవాల్యుయేషన్‌కు చివరి తేదీగా పేర్కొన్నారు. రీవాల్యూయేషన్ చివరి తేదీ ముగిసినా వెబ్సైట్లో నేటికీ మార్కులు పెట్టకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫలితాలు విడుదల తర్వాత మార్కులు వెబ్సైట్లో పెట్టకపోవడం ఎవరి నిర్లక్ష్యంగా భావించాలి.?
News October 24, 2025
గుంటూరు డీఈవోపై ఎమ్మెల్సీ ఆలపాటి ఆగ్రహం

గుంటూరు జిల్లాలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో తాజాగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. గేమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను ముద్రించారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరుకు బదులు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేరును ముద్రించారు. దీంతో డీఈవో రేణుక తీరుపై ఎమ్మెల్సీ ఆలపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
News October 24, 2025
చిచ్చర పిడుగు.. 17 ఏళ్లకే ప్రపంచ మేధావిగా గుర్తింపు

పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడి కరెక్ట్‌గా సూటవుతుంది ఈ కుర్రాడికి. 4 ఏళ్ల వయసులో కంప్యూటర్‌పై పట్టు సాధించి 12 ఏళ్లకే డేటా సైంటిస్ట్, 17 ఏళ్లకి Ai ఇంజినీర్‌గా రాణిస్తూ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. అతడే ఆసియాలోనే యంగెస్ట్ డేటా సైంటిస్ట్ పిల్లి సిద్ధార్ద్ శ్రీ వాత్సవ. తెనాలి ఐతానగర్‌కు చెందిన ప్రియమానస, రాజకుమార్ దంపతుల కుమారుడైన సిద్ధార్ద్ నేడు టోరీ రేడియో లైవ్ ఈవెంట్లో పాల్గొంటున్నాడు.


