News April 19, 2024
దాచేపల్లి వద్ద వ్యక్తి మృతదేహం లభ్యం
దాచేపల్లి మండల పరిధిలోని నాయుడుపేట సమీపంలో శుక్రవారం గుర్తు వ్యక్తి తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మృతుడి వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందన్నారు. హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 9, 2024
చంద్రబాబు అరెస్టుకు ఏడాది.. లోకేశ్ ట్వీట్
ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ కాగా, ఆ ఘటన జరిగి నేటికి ఏడాది సందర్భంగా మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘నిండు చంద్రుడు, ప్రజలు ఒక వైపు.. నియంత జగన్ కుట్రలు మరో వైపు.. చంద్రబాబు అక్రమ నిర్బంధంపై తెలుగుజాతి ఒక్కటై ఉద్యమించింది. రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు ప్రజల కోసం పరితపించే చంద్రబాబు ఏడాది క్రితం తప్పుడు కేసులో అరెస్ట్ చేయడమే వైసీపీ సమాధికి జనం కట్టిన పునాది అయింది’ అని పోస్ట్ చేశారు.
News September 9, 2024
గుంటూరు: ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కానిస్టేబుల్ సస్పెండ్
ఓ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టాభిపురం పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ హనుమంతురావు కోర్టులో పనిచేసే ఉద్యోగినికి అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అనంతరం, నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశారు.
News September 9, 2024
ANUలో విద్యార్థి మృతి.. ఆ గంటన్నరే ప్రాణం తీసింది.!
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మయన్మార్‌కు చెందిన కొండన్న(38) ఆదివారం పాముకాటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, కాటేసిన పాముకోసం వెతుకుతూ గంటన్నర పాటు వెతకడం ప్రాణాలు పోయేలా చేసినట్లు తెలుస్తోంది. మయన్మార్‌లో ఎవరినైనా పాము కరిస్తే దానిని చంపి ఆస్పత్రికి తీసుకెళ్తే, ఆపాము జాతిని బట్టి వైద్యం చేస్తారు. ఇదే విధంగా కొండన్న కూడా పాము కోసం వెతికి వైద్యసాయం ఆలస్యంగా పొందడమే చనిపోవడానికి కారణమైంది.