News March 5, 2025
దాచేపల్లి: సచివాలయ ఉద్యోగి వీడియో.. స్పందించిన లోకేశ్

పల్నాడు జిల్లా దాచేపల్లిలో సచివాలయ ఉద్యోగి పెన్షన్ డబ్బులతో పారిపోయాడు. ఈ మేరకు నిన్న క్షమించండి, డబ్బులు కట్టేస్తానంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంత్రి లోకేశ్ స్పందించారు. మనుషులుగా తప్పులు చేస్తుంటాం, కానీ వాటి నుంచి మంచి నేర్చుకోవటం ముఖ్యం. మీ కుటుంబానికి తొలి ప్రాధాన్యత ఇవ్వండి. జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లకండి అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
Similar News
News April 17, 2026
‘గరుడ’ విష్ణుమూర్తి వాహనం ఎలా అయ్యాడు?

వినత కుమారుడైన గరుడుడు తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించడానికి కద్రువ కోరిక మేరకు దేవలోకం నుంచి అమృతాన్ని తెస్తాడు. అపారమైన శక్తి ఉన్నా, అమృతంపై ఆశ పడడు. తల్లి కోసం నిస్వార్థంగా పనిచేసిన ఆయన ధైర్యం మహావిష్ణువును మెప్పించాయి. దీంతో విష్ణుమూర్తి, అతనికి చిరంజీవిత్వం ప్రసాదించి తన వాహనంగా, ధ్వజంగా స్వీకరించారు. గరుడుడు సముద్రాలను దాటగలడు. వేగవంతుడు. విష్ణు సాయం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.
News April 17, 2026
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..!

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పసుపు (పిల్ల కొమ్ము) గరిష్ఠ ధర రూ.12,400, కనిష్ఠ ధర రూ.8,000గా నమోదైంది. పసుపు (మండ కొమ్ము) గరిష్ఠ ధర రూ.11,655, కనిష్ఠం రూ.8,000 ఉండగా, కందులు రూ. 6,768, చిక్కుడు రూ. 4,611, వరి (1010) రూ. 1,752 చొప్పున పలికాయి. మొక్కజొన్న గరిష్ఠ ధర రూ. 1,857 కనిష్ఠ ధర రూ. 1,801గా పలికాయని మార్కెట్ అధికారులు. మార్కెట్‌కు ఈరోజు మొత్తం 652 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయన్నారు.
News April 17, 2026
మెట్‌పల్లి మార్కెట్లో పసుపు ధరలు ఇలా..!

మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పలికిన పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 14,516, కనిష్ఠం రూ. 9,009, పసుపు గోళ గరిష్ఠం రూ. 13,566, కనిష్ఠం రూ. 8,585, పసుపు చూర గరిష్ఠం రూ. 11,555, కనిష్ఠం రూ. 8,181గా పలికాయి. ఈ రోజు మార్కెట్‌కు మొత్తం 956 క్వింటాళ్ల పసుపు అమ్మకానికి వచ్చిందని మార్కెట్ అధికారులు తెలిపారు.


