News May 25, 2024
దాడికి పాల్పడ్డ వారిని శిక్షించాలి: చంద్రబాబు

ఎన్నికల్లో ఓటమి ఖాయమవ్వడంతో విచక్షణ కోల్పోయిన వైసీపీ నేతలు టీడీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గం, 89పెద్దూరుకు చెందిన టీడీపీ కార్యకర్త శేషాద్రిపై వైసీపీ మూకలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు.. దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. శేషాద్రి కుటుంబానికి అండగా ఉంటానన్నారు.
Similar News
News February 8, 2025
పవన్‌పై అభిమానం.. విజయవాడకు పయనం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అభిమానంతో చిత్తూరు యువకుడు సాహసానికి శ్రీకారం చుట్టాడు. శాంతిపురం మండలం కోలాల తిమ్మనపల్లె గ్రామానికి చెందిన జనసైనికుడు బాలకృష్ణ పుట్టుకతో దివ్యాంగుడు. పవన్‌కు అతను వీరాభిమాని. ఎలాగైనా అతడిని కలవాలన్న ఉద్దేశంతో మూడు చక్రాల సైకిల్‌పైనే విజయవాడకు పయనమయ్యాడు.
News February 7, 2025
అందాల పోటీల్లో చంద్రగిరి అమ్మాయికి కిరీటం.. CM ప్రశంస

మలేషియాలో జరిగిన మిస్ గ్లోబల్ ఆసియా-2025 విజేతగా చంద్రగిరికి చెందిన భావన రెడ్డి నిలిచారు. 18 ఏళ్లకే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి మిస్ గ్లోబల్ ఆసియా-2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ మేరకు ఆమె గురువారం CM చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ వేదికపై తిరుపతి పేరును గట్టిగా వినిపించిన ఆమెను CM అభినందించారు.
News February 7, 2025
బీసీ కార్పొరేషన్ లోన్లకు దరఖాస్తు గడువు 12కు పెంపు

బీసీ కార్పొరేషన్ దరఖాస్తు గడువును 12కు పెంచినట్లు చిత్తూరు జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి తెలిపారు. బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయడానికి, లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న యూనిట్లకు దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ వరకూ పెంచిందన్నారు.