News March 21, 2025

దాడి కేసులో ఇద్దరికి రిమాండ్: వాంకిడి ఎస్సై

image

వాంకిడి మండలంలోని ఓ బిర్యాణి హోటల్ యజమానిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం..ఈ నెల 18న వాంకిడిలోని ఓ బిర్యానీ హోటల్లో రవిచంద్ర కాలనీకి చెందిన కొండ సంతోష్, పస్తం ఇషాక్ మద్యం మత్తులో బిర్యానీ తినడానికి వెళ్లారు. ఈ క్రమంలో హోటల్ యజమానితో గొడవకు దిగి దాడి చేశారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News November 18, 2025

శంషాబాద్‌: గర్భంలోనే కవలలు మృతి.. భర్త ఆత్మహత్య

image

భార్య గర్భంలోని కవలలు మృతిచెందారనే దుఃఖంతో శంషాబాద్‌లోని సామ ఎన్‌క్లేవ్‌లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆతహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం.. కర్ణాటకకు చెందిన ముత్యాల విజయ్ భార్య శ్రావ్య 8 నెలల గర్భిణీ. కవలల మరణ వార్త తెలిసి విజయ్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎచ్చెర్ల: నన్ను కాపాడండి సార్.. చిన్నారి వేడుకోలు..!

image

ఎచ్చెర్లలోని ముద్దాడకు చెందిన ఐదేళ్ల సింధు నందన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యులు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని సూచించారు. అయితే ఆ చికిత్సకు రూ.25 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. తమ ఆర్థిత స్థోమత సరిగాలేదని ప్రభుత్వం ఆదుకుని తమ బిడ్డను బతికించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.