News March 21, 2025
దాడి కేసులో ఇద్దరికి రిమాండ్: వాంకిడి ఎస్సై

వాంకిడి మండలంలోని ఓ బిర్యాణి హోటల్ యజమానిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం..ఈ నెల 18న వాంకిడిలోని ఓ బిర్యానీ హోటల్లో రవిచంద్ర కాలనీకి చెందిన కొండ సంతోష్, పస్తం ఇషాక్ మద్యం మత్తులో బిర్యానీ తినడానికి వెళ్లారు. ఈ క్రమంలో హోటల్ యజమానితో గొడవకు దిగి దాడి చేశారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News April 24, 2025
అమరావతిలో ప్రధాని షెడ్యూల్ ఇదే

AP: ప్రధాని మోదీ మే 2వ తేదీన అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆరోజు మ.3 గంటలకు ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మ.3.30 గంటలకు అమరావతికి వచ్చి 1.1 కి.మీ మేర 15 నిమిషాలపాటు రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత అమరావతి పెవిలియన్‌ను సందర్శిస్తారు. సా.4 నుంచి 5 వరకు సభలో పాల్గొని తిరుగు ప్రయాణమవుతారు.
News April 24, 2025
స్విట్జర్లాండ్ వీసా రిజెక్ట్.. మినీ స్విట్జర్లాండ్‌లో ఉగ్రతూటాకు బలి

ఉగ్రదాడిలో చనిపోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ ఉదంతంలో మరో హృదయవిదారక అంశం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న అతను హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాలనుకున్నారు. వీసా రిజెక్ట్ కావడంతో మినీ స్విట్జర్లాండ్‌గా భావించే పహల్‌గామ్ వెళ్లి ఉగ్రతూటాకు బలయ్యారు. అతడికి చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని ఉండేదని, అందుకే నేవీలో చేరాడని పేరెంట్స్ చెప్పారు.
News April 24, 2025
కర్నూలు జిల్లా టాపర్లు వీరే!

కర్నూలు జిల్లా విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అదరగొట్టారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన ఏడుగురు 597 మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు. కర్నూలుకు చెందిన టి.గాయత్రి, గీతిక, కీర్తన, ఎమ్మిగనూరుకు చెందిన మహ్మద్, ఆదోనికి చెందిన సలీమా, జి.నందు, హరిణి టాపర్ల జాబితాలో ఉన్నారు. ఇక జిల్లాలో మొత్తం 31,185 మంది పరీక్ష రాయగా 20,584 మంది పాసయ్యారు.