News March 24, 2024
దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలి: కౌశిక్ రెడ్డి

బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన దానం నాగేందర్ ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరారని, ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో నాగేందర్ పేరు ఉందని, వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. ఈ విషయమై ఇటీవల అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కలిశామని కౌశిక్ రెడ్డి చెప్పారు.
Similar News
News February 22, 2026
రేపు యథావిధిగా ‘ప్రజావాణి’: జిల్లా కలెక్టర్

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఉదయం నిర్ణీత సమయానికి అధికారులు హాజరై ఫిర్యాదులను స్వీకరిస్తారని పేర్కొన్నారు.
News February 22, 2026
భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వరద కాలువ, మిడ్ మానేరు, గౌరవెల్లి వంటి ప్రాజెక్టుల పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి, రైతుల ప్రయోజనాల దృష్ట్యా భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.