News January 28, 2025
దామరగిద్ద: అనుమానాస్పద స్థితిలో.. చిరుత మృతి

దామరగిద్ద మండలం ఉడుమలగిద్ద గ్రామ సమీపంలోని గుట్టల మధ్య బండరాల్లో ఇరుక్కుని అనుమానాస్పద స్థితిలో ఓ చిరుత మృతి చెందింది. మంగళవారం స్థానిక వ్యవసాయదారులు సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు చేరవేశారు. సంబంధిత ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫారెస్ట్ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుంటున్నారని సమాచారం. చిరుత మృతికి గల కారణాలు తెలుసుకొని విచారణ చేపడుతామన్నారు.
Similar News
News December 17, 2025
ASF: మూడో విడత ఎన్నికలకు సన్నద్ధం: కలెక్టర్

మూడో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్నగర్ మండలాల్లో 104 సర్పంచ్, 744 వార్డు స్థానాలకు 17న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్, 2 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలో 1.22 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
News December 16, 2025
Photos: వనతారలో మెస్సీ పూజలు

‘గోట్ టూర్’లో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్న అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇవాళ గుజరాత్కు వెళ్లారు. అంబానీ ఫ్యామిలీకి చెందిన వనతారను సందర్శించారు. తన తోటి ప్లేయర్లు సురెజ్, రోడ్రిగోతో కలిసి అక్కడి ఆలయంలో పూజలు చేశారు. నుదుటిన బొట్టుతో, హారతి ఇస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారితోపాటు అనంత్ అంబానీ, రాధిక దంపతులు ఉన్నారు.
News December 16, 2025
నెహ్రూ జూ పార్క్లో AI కమాండ్ కంట్రోల్ సెంటర్

నెహ్రూ జూ పార్క్ చరిత్రలో ఒక అద్భుతం జరగబోతోంది. త్వరలో AI కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. అడవి బిడ్డల రక్షణలో ఇది సరికొత్త రికార్డు సృష్టించనుంది. AI సాయంతో జంతువుల ప్రతి కదలికను, వాటి ఆరోగ్యాన్ని 24/7 పర్యవేక్షించవచ్చు. ఏదైనా చిన్న మార్పు వచ్చినా ఈ స్మార్ట్ సెంటర్ వెంటనే హెచ్చరిస్తుంది. ప్రైవేట్ సౌండ్-ప్రూఫ్ టెక్నాలజీతో ఈ కేంద్రాన్ని నిర్మించడం విశేషం.


