News February 13, 2025
దామరగిద్ద: అర్ధరాత్రి దొంగల బీభత్సం

దామరగిద్ద మండలం ఉల్లిగుండం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని సి. వెంకటప్ప ఇల్లు తాళం పగలగొట్టి ఇంట్లో బీరువా ధ్వంసం చేసి రూ. లక్ష నగదు, తులం బంగారం ఎత్తుకెళ్లారు. అనంతరం పక్కనే ఉన్న మరో ఇంటి తాళాలు పగలకొడుతుండగా స్థానికులు అప్రమత్తమై కేకలు వేస్తూ వెంబడించారు. దీంతో దుండగులు బైక్‌ను వదిలి పారిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
Similar News
News November 12, 2025
హైదరాబాద్‌లో జగిత్యాల వాసి అనుమానాస్పద మృతి

వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన ఘటన HYDలోని మియాపూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలకు చెందిన సతీశ్ మియాపూర్‌లోని హాస్టల్లో ఉంటూ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి సతీశ్ హాస్టల్లోని తన రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉండటంతో హాస్టల్ యజమాని చూడగా అప్పటికే మృతిచెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి కేసు నమోదు చేశారు.
News November 12, 2025
పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని చోడవరం తరలింపు

వడ్డాదిలో <<18264743>>పిచ్చికుక్క <<>>దాడితో గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో చోడవరం CHCకి తరలించినట్లు డాక్టర్ రమ్య తెలిపారు. వడ్డాది PHCలో రేబీస్ వ్యాక్సినేషన్, ప్రథమ చికిత్స అనంతరం బాధితులను తరలించామన్నారు. కాగా పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారి సంఖ్య 15కి చేరుకుంది. గాయపడిన వారు ఒక్కొక్కరు ఆసుపత్రికి వస్తున్నారు. పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
News November 12, 2025
షాహీన్.. పనులతో పరేషాన్!

ఉగ్రకుట్ర కేసులో <<18257542>>అరెస్టైన<<>> డా.షాహీన్ దేశంలో జైషే మహ్మద్ ఉమెన్స్ వింగ్‌ను నడిపిస్తోంది. ఉగ్ర సంస్థ మహిళా విభాగం చీఫ్, జైషే ఫౌండర్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్‌తో షాహీన్‌కు నేరుగా సంబంధాలున్నట్లు గుర్తించారు. చీఫ్ ఆదేశాలతో ఆమె దేశంలో మహిళలకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదంలోకి దింపుతోంది. షాహీన్ అమాయకంగా, క్రమశిక్షణతో ఉండేదని 2009లో ఆమె పనిచేసిన కన్నౌజ్ మెడికల్ కాలేజీ అధికారులు చెప్పడం గమనార్హం.


