News June 2, 2024
దామరగిద్ద: బావిలో పడి యువకుడి మృతి
నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దామరగిద్ద మండలం కానుకుర్తి నిరంజన్ స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి బావిలో పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన బాబమ్మ, సామలప్ప దంపతుల రెండో కుమారుడు నిరంజన్(చింటు) మధ్యాహ్నం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని ఓ బావిలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో అందులో మునిగి నిరంజన్ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 20, 2024
ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రతలివే…
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా దేవరకద్రలో 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా ఎళ్లికలో 36.2 డిగ్రీలు, నారాయణపేట జిల్లా మొగలమట్కాలో 35.8 డిగ్రీలు, గద్వాల జిల్లా వెంకటాపూర్ లో 35.7 డిగ్రీలు, వనపర్తి జిల్లా పెద్దమందడిలో 35.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News September 20, 2024
వనపర్తి: BRS సీనియర్ నాయకుడి మృతి
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన BRS సీనియర్ నాయకుడు నాగరాల శ్రీనివాస్ రెడ్డి అనారోగ్య కారణంతో శుక్రవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
News September 20, 2024
మహబూబ్‌నగర్: తండ్రిని చంపేశాడు..!
ఓ యువకుడు తండ్రిని హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. రాజాపూర్ మండలం రాయపల్లికి చెందిన కావలి నారాయణని అతడి కుమారుడు నందు హత్య చేశాడు. గురువారం రాత్రి అందరూ పడుకున్నాక గొడ్డలితో నరికి చంపాడు. నందుకు కొంత కాలంగా మతిస్థిమితం లేదు. ఏ పని చేయకుండా ఊర్లో తిరుగుతుండేవాడు. కాగా రోజూ నారాయణ ఇంటికి గొళ్లెం పెట్టుకునేవాడు. రాత్రి పెట్టుకోకపోవడంతో అదును చూసి చంపేయగా నందును పోలీసులు అరెస్ట్ చేశారు.