News February 13, 2025

దామరగిద్ద: మన్యంకొండ జాతరకు వెళ్తే ఇళ్లు దోచారు !

image

దామరగిద్ద మండలంలోని ఉల్లిగుండం గ్రామానికి చెందిన చాలామంది తమ ఇంటి ఇలవేల్పు మన్యంకొండ జాతర రథోత్సవానికి ఎడ్లబండ్లతో బయలుదేరి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఆ గ్రామంపై కన్నేశారు. బుధవారం అర్ధరాత్రి పలు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు గమనించి వారిని వెంబడించగా.. వారు తెచ్చుకున్న బైక్ వదిలి పారిపోయినట్లు స్థానికులు వాపోతున్నారు. పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.

Similar News

News February 14, 2025

MBNR: హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ 

image

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీకి వచ్చిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. గోపి గురించి మెడికల్ ఆఫీసర్‌‌ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వస్తున్న రోగులు ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో లేబర్ రూమ్‌‌ను పరిశీలించి ఆరోగ్యంగా ఉన్న తల్లి బిడ్డలను పరామర్శించారు.

News February 13, 2025

MBNR: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళలకు “SBIRSETI” ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ G.శ్రీనివాస్ తెలిపారు. గురువారం Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. బ్యూటీ పార్లర్ & ఎంబ్రాయిడరీలలో 30 రోజులపాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. SSC MEMO, ఆధార్, రేషన్ కార్డులతో ఈనెల 17లోపు దరఖాస్తులు చేసుకోవాలని, 19-45 సం.లలోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 95424 30607కు సంప్రదించాలన్నారు.

News February 13, 2025

MBNR: జన సంద్రంగా మన్యంకొండ

image

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం భక్త జనసంద్రమైంది. భక్తుల గోవింద నామ స్మరణంతో ఆలయ గిరులు మారుమోగాయి. గురువారం తెల్లవారుజాము వరకు జరిగిన రథోత్సవ వేడుకలలో స్థానిక MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, SP జానకి, జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి, హుడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్  తదితరులు పాల్గొన్నారు.  

error: Content is protected !!