News March 21, 2025
దామరగిద్ద: రోగులకు మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం ఉంచి ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను, పరిశీలించారు. వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల నిల్వ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు.
Similar News
News February 28, 2026
మోదీ పర్యటన ముగిసిన వెంటనే ప్లాన్ అమలు!

ఇరాన్‌పై దాడికి అమెరికా-ఇజ్రాయెల్ చాలా రోజుల కిందటే ప్లాన్ చేశాయి. భారత PM మోదీ ఈ నెల 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించిన నేపథ్యంలో అటాక్‌ను వాయిదా వేసినట్లు నిపుణుల అంచనా. ఆయన దేశంలో ఉండగా ఉద్రిక్తతలకు తావు లేకుండా నెతన్యాహు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. కాగా మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్‌పై US దాడి చేస్తుందని MIM చీఫ్ అసదుద్దీన్ ఇటీవల చెప్పిన <<19240749>>జోస్యం<<>> నిజమైంది.
News February 28, 2026
HYD దాహార్తిని తీర్చేందుకు సర్కార్ స్కెచ్

HYD దాహార్తిని తీర్చేందుకు సర్కార్ అదిరిపోయే స్కెచ్ వేసింది. నియోపోలిస్ ఎత్తు ప్రాంతాన్ని వాడుకొని పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీళ్లందించేలా పక్కా ప్లాన్ రెడీ చేసింది. కొండపై భారీ రిజర్వాయర్లు కట్టి.. అక్కడి నుంచి మెహదీపట్నం, షేక్‌పేట, బోజగుట్టలకు గోదావరి జలాలను పారించనున్నారు. పంపింగ్ అవసరం లేకపోవడంతో జలమండలికి కోట్లాది రూపాయల కరెంటు బిల్లులు ఆదా కానున్నాయి. నగరవాసుల నీటి కష్టాలు తీరనున్నాయి.
News February 28, 2026
మెదక్: నాలుగో రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) మాధవి తెలిపారు. జనరల్ విభాగంలో 4,869 మందికి గాను 4,799 మంది, ఒకేషనల్ విభాగంలో 540 మందికి గాను 525 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తంగా 98.42% హాజరు నమోదైందని వివరించారు.


