News June 21, 2024

దామరచర్లలో ఉరి వేసుకుని యువతి సూసైడ్

image

ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దామరచర్లలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. కొత్తగూడెంకు చెందిన దొడ్డా సురేశ్ యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ పాల్వంచకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 3, 2025

ఆ వివరాలు ఇవ్వకుంటే.. ఇదే జరుగుద్ది: నల్గొండ కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా లెక్కలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి పోలింగ్ వరకు ఎంత డబ్బు ఖర్చు చేశారో వాటికి సంబంధించిన ఆధారాలతో కూడిన వివరాలను ఎన్నికల అధికారులకు అందించాలన్నారు. లేదంటే గెలిచిన వారు పదవులు కోల్పోతారన్నారు. మూడేళ్లపాటు పోటీకి అనర్హులు అవుతారని, ఓడిన వారు కూడా ఇవ్వాల్సిందేనని తెలిపారు.

News December 3, 2025

నల్గొండ: అప్పీల్స్‌ను పరిశీలించిన కలెక్టర్

image

నల్గొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లతోపాటు తిరస్కరణలపై వచ్చిన అప్పీల్స్‌ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. 9 మండలాల నుంచి ఆర్డీవోలు అశోక్ రెడ్డి, శ్రీదేవి సమర్పించిన జాబితాపై కలెక్టర్ సమగ్ర పరిశీలన చేశారు. నల్గొండ డివిజన్‌లో వచ్చిన 19 అప్పీల్స్‌లో 15 తిరస్కరణ,4 అంగీకరించగా చండూరు డివిజన్‌లో 3 అప్పీలు రాగా వీటిలో 2 తిరస్కరణ, 1 అంగీకరించారు.

News December 3, 2025

నల్గొండ: మూడో దశ.. నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ

image

దేవరకొండ నియోజకవర్గంలో ఈరోజు నుంచి మూడో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఉ.10 గంటల నుంచి ప్రారంభం కానుంది. మొత్తం దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది మండలాల్లో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని చందంపేట, నేరేడు,గుమ్ము మండలాలలోని సమస్యాత్మక కేంద్రాల్లో గట్టి పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.