News September 25, 2024

దామరచర్ల: హత్యాచార కేసు ఛేదన

image

దామరచర్ల మండలం ఓ తండాలో ఈనెల 14న జరిగిన హత్యాచార కేసును ఛేదించినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. తండాకు చెందిన యువతిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని డీఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి 2 సెల్‌ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 15, 2024

నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం 61,440 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా..  అవుట్ ఫ్లో 40,912 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589.00 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.50 TMCలు కాగా ప్రస్తుతం నీటి నిలువ సామర్థ్యం 307.2834 TMCలు ఉన్నట్లు అధికారులు  తెలిపారు.

News October 15, 2024

భువనగిరి: ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుల సమావేశంలో పాల్గొన్న ఎంపీ

image

మహారాష్ట్ర ,ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ముంబైలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రమేశ్ చేన్నితల, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నానా పటోలే ఆధ్వర్యంలో జరుగుతున్న ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుల సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ వంశీ చందర్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

News October 15, 2024

నల్గొండ: విద్యుత్ శాఖలో ముగిసిన బదిలీల ప్రక్రియ

image

నల్గొండ జిల్లాలో విద్యుత్ శాఖ మూడు డివిజన్ల పరిధిలో బదిలీల ప్రక్రియ ముగిసింది. 34 మంది లైన్ ఇన్‌స్పెక్టర్లు, 126 మంది లైన్మెన్లు, 30 మంది అసిస్టెంట్ లైన్మెన్లు, ఇద్దరు జూనియర్ లైన్మెన్లు బదిలీ అయ్యారు. నల్గొండ డీఈ (ఆపరేషన్) అన్నమయ్య పదోన్నతి పై హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చారు. నల్గొండలో పనిచేస్తున్న వెంకటేశ్వర్లు భువనగిరికి బదిలీ అయ్యారు.