News April 5, 2025
దామెర: తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె..!

హనుమకొండ జిల్లా దామెర మండల పరిధి లాదెల్ల గ్రామంలో లాదెల్ల బిక్షపతి శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. భిక్షపతికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు లేకపోవడంతో కుమారుడి బాధ్యత పెద్ద కుమార్తె అయిన శోభారాణి తీర్చారు. మృతుడి దహన సంస్కారాలకు హాజరైన బంధుమిత్రులు, గ్రామ ప్రజలు శోభారాణి తలకొరివి పెట్టడం చూసి కన్నీరు మున్నీరయ్యారు.
Similar News
News December 16, 2025
సంగారెడ్డి: అమ్మో చలి

సంగారెడ్డి జిల్లాలో వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. మంగళవారం వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 12.2 డిగ్రీలు, గుమ్మడిదలలో 13.6 డిగ్రీలు, అమీన్పూర్లో 14.7° డిగ్రీలు, రామచంద్రాపురంలో 15.1 డిగ్రీలు, పటాన్ చెరులో 11.5° ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 89.4%గా ఉంది. ఉదయం పూట చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలను కాచుకుంటున్నారు.
News December 16, 2025
నరసరావుపేట: చిన్న వ్యాపారాలతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న డ్వాక్రా మహిళలు

ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందజేస్తున్న రుణాలతో డ్వాక్రా మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు, చేతి వృత్తులు చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారు. ముఖ్యంగా శ్రీనిధి, గ్రామ సంఘం ఉన్నతి పథకాల ద్వారా ఈ రుణాలు అందజేస్తున్నారు. యూనియన్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల సహకారంతో డ్వాక్రా సంఘాలకు నిధులు అందుతున్నాయి. ఈ రుణాలతో గ్రామీణ మహిళలు వ్యవసాయం, పాడి పరిశ్రమలు నిర్వహిస్తూ ఆదాయం పొందుతున్నారు.
News December 16, 2025
ఆలిండియా స్థాయిలో ‘మన కర్నూలు’ మేడమ్

ఆదోని ఛాగి పంచాయతీ కార్యదర్శి ఎస్. నాగమణి బిహార్లో జరిగిన జాతీయ స్థాయి ఆలిండియా సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఏపీ జట్టుకు సోమవారం ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర స్థాయి పరుగు పందెం, ఖోఖో పోటీల్లో విజయం సాధించి ఆమె జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. పట్నాలో జరిగిన 4×400 మీటర్ల పరుగు పందెంలో ఏపీ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. దీనిపై తోటి ఉద్యోగులు అభినందించారు.


