News April 12, 2025
దామెర: వడదెబ్బతో తాపీ మేస్త్రి మృతి

హన్మకొండ జిల్లా దామెర మండలంలో విషాదం చోటుచేసుకుంది. వడదెబ్బతో తాపీ మేస్త్రీ మల్లేశం(46) మృతి చెందారు. ఓ ఇంటి దాబాపై పనిచేస్తున్న క్రమంలో వడదెబ్బ తగిలి మృతి చెందాడని మల్లేశం భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI అశోక్ తెలిపారు. వేసవి దృష్ట్యా కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని SI సూచించారు.
Similar News
News April 18, 2025
ICDS నెల్లూరు PDగా సువర్ణ బాధ్యతల స్వీకరణ

నెల్లూరు జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా సువర్ణ బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో పీడీగా విధులు నిర్వహిస్తున్న సుశీల అనారోగ్యంతో సెలవుపై వెళ్లారు. ఇన్‌ఛార్జ్ పీడీగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కొనసాగుతున్నారు. దీంతో సువర్ణను రెగ్యులర్ పీడీగా నియమించారు.
News April 18, 2025
TCS లే ఆఫ్స్‌పై ఉద్యోగుల ఫిర్యాదు

USలోని TCS కంపెనీపై ఆ దేశ ‘సమాన ఉపాధి హక్కుల కమిషన్’ విచారణ చేపట్టింది. ఇండియాకు చెందిన హెచ్1బీ వీసాదారులకు లేఆఫ్స్ ఇవ్వకుండా కేవలం దక్షిణాసియేతర ఉద్యోగులనే పక్షపాతంగా తొలగిస్తున్నారని ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఆరోపణలను TCS ప్రతినిధులు ఖండించారు. మెుదటి నుంచి TCS సంస్థ సమానత్వం, సమగ్రత కల్పించడంతో ముందు స్థానంలో ఉంటుందని తెలిపారు.
News April 18, 2025
భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో వీటికి చోటు దక్కింది. ఇది ప్రపంచంలోని ప్రతీ భారతీయుడికి గర్వకారణమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారతీయ సంస్కృతికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. భగవద్గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా దేశ నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయని పేర్కొన్నారు.