News April 12, 2025
దామెర: వడదెబ్బతో తాపీ మేస్త్రి మృతి

హన్మకొండ జిల్లా దామెర మండలంలో విషాదం చోటుచేసుకుంది. వడదెబ్బతో తాపీ మేస్త్రీ మల్లేశం(46) మృతి చెందారు. ఓ ఇంటి దాబాపై పనిచేస్తున్న క్రమంలో వడదెబ్బ తగిలి మృతి చెందాడని మల్లేశం భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI అశోక్ తెలిపారు. వేసవి దృష్ట్యా కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని SI సూచించారు.
Similar News
News November 18, 2025
ఏలూరు: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత సివిల్స్ శిక్షణ

ఏలూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు విజయవాడలో ఉచిత సివిల్స్, మెయిన్స్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నాగరాణి సోమవారం తెలిపారు. ఈనెల 17 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 5న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, 10వ తేదీ నుంచి అర్హులకు ఉచిత వసతి, శిక్షణ ఇస్తారని ఆమె పేర్కొన్నారు.

నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో నాసిరకం భోజనం..?

NZB జిల్లా డిచ్పల్లి పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీలో వంటల్లో నాసిరకం సరకులు వాడుతున్నారంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం వర్సిటీలోని హాస్టల్ విద్యార్థులు వంట సామగ్రి నాణ్యతపై నిరసన తెలియజేశారు. ఓల్డ్ బాయ్స్ హాస్టల్ మెస్లో వంటకాలను తయారు చేయడానికి నిల్వ ఉన్న, తక్కువ నాణ్యత గల సరకులు వినియోగిస్తున్నారని, దీనివల్ల తమ ఆరోగ్యం దెబ్బతింటుందని విద్యార్థులు వాపోయారు.