News February 14, 2025
దామోదరయ్య చిత్రపటానికి కలెక్టర్ నివాళి

ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య చిత్రపటానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ నివాళులర్పించారు. సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్వో విజయసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 6, 2025
గ్లోబల్ సమ్మిట్: రూ.250 లక్షల కోట్లే లక్ష్యం!

భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కేవలం పెట్టుబడుల సమావేశం కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక విధానాల విప్లవం. 2047 నాటికి $3 ట్రిలియన్ (సుమారు ₹250 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థ దిశగా ముఖ్యమంత్రి ఆవిష్కరించే ‘తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’ సారాంశమే ఈ సమ్మిట్. తయారీ, టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పటిష్ఠమైన, స్థిరమైన నూతన పాలసీలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.
News December 6, 2025
జీఎస్టీ&సెంట్రల్ ఎక్సైజ్ చెన్నైలో ఉద్యోగాలు

జీఎస్టీ కమిషనర్&సెంట్రల్ ఎక్సైజ్, చెన్నై స్పోర్ట్స్ కోటాలో 20 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, హవల్దార్, MTS పోస్టులు ఉన్నాయి. క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ, యూనివర్సిటీ స్థాయిలో పతకాలు సాధించిన వారు డిసెంబర్ 18 నుంచి జనవరి 7వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://gstchennai.gov.in/
News December 6, 2025
హోంగార్డ్ వ్యవస్థ పోలీస్ శాఖలో అంతర్భాగం: ఎస్పీ స్నేహ మెహ్రా

హోంగార్డ్ వ్యవస్థ పోలీస్ శాఖలో ఒక ముఖ్యమైన అంతర్భాగమని ఎస్పీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు. హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా ఆమె మాట్లాడారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సమయాల్లో అదనపు శక్తిగా పనిచేస్తుందని తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను మంజూరు చేశారు. అంకితభావంతో పనిచేసిన హోంగార్డులకు ఎస్పీ ప్రశంసా పత్రాలతో అభినందించారు.


