News February 14, 2025
దామోదరయ్య చిత్రపటానికి కలెక్టర్ నివాళి

ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య చిత్రపటానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ నివాళులర్పించారు. సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్‌వో విజయసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 28, 2025
‘కిలోకి రూ.10 కమీషన్’ నిరూపిస్తే ఆస్తులు రాసిస్తా: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే

కర్నూలులోని ‘సాక్షి’ ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వైసీపీకి సవాల్ విసిరారు. ‘చికెన్ షాపుల నుంచి మేము కిలోకు రూ.10 తీసుకుంటున్నట్లు నిరూపిస్తే నా ఆస్తులు రాసిస్తా. లేదంటే నాపై రాసిన వార్తలన్నీ తప్పని ప్రచురించాలి. నాపై ఇలాంటి వార్తలు రాయడం తగదు’ అంటూ ఆమె హెచ్చరించారు. కాగా నిన్న సాక్షి కార్యాలయం ముందు కోళ్ల వ్యర్థాలు, చెత్త పడేసి ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
News March 28, 2025
నర్సంపేట: ‘దొంతి’కి మంత్రి పదవి దక్కేనా..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడు, నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డికి మంత్రి పదవి వస్తుందనే చర్చ కొన్ని రోజులుగా కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో దొంతికి కూడా మంత్రి పదవి వస్తుందని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన కలిసినట్లు తెలిసింది. ఇంత వరకు నర్సంపేట నియోజకవర్గానికి చెందిన వారికి మంత్రి పదవి రాలేదు
News March 28, 2025
తండ్రి మరణంలోనూ కుమార్తెకు ‘పరీక్ష’!

తండ్రి మరణంతో దుఃఖాన్ని దిగమింగుకుని పది పరీక్షలకు హాజరైంది ఓ విద్యార్థిని. ఉరవకొండ మం. రాకెట్లకు చెందిన రఘు(48) కూడేరు మండలం గొట్కూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రక్షిత పది పరీక్షలు రాస్తోంది. తన పెద్ద కుమార్తెను కాలేజీలో విడిచిపెట్టి తిరిగి బైక్‌పై వస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందారు. తండ్రి లేడన్న బాధను దిగమింగుకుని చిన్నకూతురు పరీక్ష రాసింది.