News January 25, 2025
దామోదర్ క్షేమంగానే ఉన్నాడు: మావోయిస్టు పార్టీ లేఖ

ములుగు జిల్లా కాల్వపల్లికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు@ దామోదర్ క్షేమంగా ఉన్నట్లు ఆ పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో సోంబే పేరుతో మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ఈ నెల 16న 8 వేలమంది పోలీసు బలగాలతో బీజాపూర్ జిల్లాలోని పలు గ్రామాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మంది కార్మికులు చనిపోయారన్నారు. కాగా పోలీసులు తప్పుడు ప్రకటన చేశారని, దామోదర్ క్షేమంగానే ఉన్నాడని తెలిపారు.
Similar News
News February 8, 2025
జగిత్యాల: బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లలో వాగు వద్ద గల బావిలో ఓ వ్యక్తి మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బహిర్భూమి కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని తెలుపుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి ఎస్‌ఐ ఉదయ్ వెళ్లి పరిశీలించారు. మృతుడు జగిత్యాలకు చెందిన ఎండీ హమీద్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 8, 2025
చిత్తూరు: రైలులో గర్భిణిపై అత్యాచారయత్నం

రైలులో గర్భిణిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన జోసెఫ్ భార్య 4నెలల గర్భిణి. ఆమె కోయంబత్తూరు- TPT ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కి పుట్టినిల్లు చిత్తూరు సమీపంలోని మంగసముద్రానికి బయలు దేరింది. వేలూరు జిల్లాకు చెందిన హేమరాజ్(28) మహిళా బోగిలో ఎక్కి ఆమె ఒంటరిగా ఉండడంతో అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేసి రైలు నుంచి బయటకు తోసేశాడు.
News February 8, 2025
సిరిసిల్ల: ట్రాక్టర్‌లో నాటుబాంబు పెట్టేందుకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన మానుక మహిపాల్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గతేడాది డిసెంబర్ 29న గ్రామానికి చెందిన గురక ఎల్లయ్య ట్రాక్టర్ సైలెన్సర్‌లో నాటు బాంబు పెట్టి పేల్చేందుకు కుట్ర పన్నినట్లు తెలిపారు. విచారణ జరిపి అతని నుంచి ఒక నాటు బాంబును స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్టు ఎస్ఐ చెప్పారు.