News June 11, 2024
దారుణం.. బాలికపై 46ఏళ్ల వ్యక్తి అత్యాచారం

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలోని ఓ గ్రామంలో సోమవారం 12ఏళ్ల బాలికపై 46ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. బాలికకు తండ్రి లేడని, తల్లి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లగా అమ్మమ్మ వద్ద ఉంటుందన్నారు. పోలీసులకు సమాచారం అందడంతో సీఐ ప్రశాంత్, ఎస్సై రాజేష్ గ్రామానికి చేరుకుని బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 26, 2025
నల్లజర్ల : శిశువు మృతి

నల్లజర్ల ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు పీకుతుండగా.. స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే శిశువు చికిత్స పొందుతూ రా.12 గం.లకు మరణించిందని సీడీపీఓ నాగలక్ష్మి తెలిపారు. ఘటనపై FIR చేయించామని, వివరాల సేకరణకు అంగనవాడీ సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు.
News March 26, 2025
అనపర్తి: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి బెదిరింపులు

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి తమ కోరిక తీర్చాలని బెదిరించిన ఇద్దరూ వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీను నాయక్ మంగళవారం తెలిపారు. అనపర్తి మండలం పీరా రామచంద్రపురానికి చెందిన మణికంఠ రెడ్డి, రామకృష్ణారెడ్డి ఓ వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి, తమ కోరిక తీర్చాలని, రూ.1లక్ష ఇవ్వాలని ఆమెను బెదిరించారు. దీంతో ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
News March 26, 2025
ఉపసర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: జేసీ

జిల్లాలో 12 గ్రామాలలో ఈ నెల 27న ఉప సర్పంచ్‌ల, బిక్కవోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, పెరవలి, రంగంపేటల రెండు కో-ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఆ మేరకు అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.