News September 16, 2024
దారుణం.. 12 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే బాలికతో కలిసి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.
Similar News
News December 29, 2025
ఖమ్మం: గంజాయి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

గంజాయి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2020 OCT 8న కొణిజర్ల(M) తనికెళ్ల వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ప్రవీణ్ కుమార్ ₹19 లక్షల విలువైన 130 కేజీల గంజాయితో పట్టుబడ్డాడు. నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావటంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.
News December 29, 2025
ఖమ్మం: తగ్గిన దొంగతనాలు, చైన్ స్నాచింగ్, హత్యలు: సీపీ

పోలీస్ యంత్రాంగం సమష్టి కృషితో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు నియంత్రణలో ఉన్నాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. వార్షిక నివేదిక-2025ను సీపీ సోమవారం వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే చోరీ సొత్తు రికవరీ 9%, నేరాలను ఛేదించడం 11% పెరిగిందన్నారు. అటు లోక్ ఆదాలత్ ద్వారా 36,709 కేసుల పరిస్కారం లభించిందన్నారు. అటు ఈ ఏడాది జరిగిన 928 రోడ్డు ప్రమాదాల్లో 332 మంది మృతి చెందగా.. 809 మంది గాయపడ్డారన్నారు.
News December 29, 2025
ఖమ్మం: 507 క్వింటాల గంజాయి ధ్వంసం: సీపీ

గత ఏడాదితో పోలిస్తే కేసుల నమోదులో 9 శాతం పెరిగిందని ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తెలిపారు. సైబర్ క్రైం రేట్ కూడా పెరిగిందన్నారు. రికవరీ కూడా అదే స్థాయిలో చేశామన్నారు. టాస్క్ ఫోర్స్ ద్వారా అక్రమ ఇసుక, మట్టి, నకిలీ విత్తనాలు తదితర కేసులను కట్టడి చేసినట్లు చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా భారీగా కేసులను రాజీ కుదిర్చినట్లు పేర్కొన్నారు. 507 క్వింటాల గంజాయిని ధ్వంసం చేశామని సీపీ వెల్లడించారు.


