News January 17, 2025
దావోస్‌కు మంత్రి టీజీ భరత్

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ దావోస్‌కు వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో కలిసి ఆయన రేపు రాత్రి పయనం అవుతారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని వారు ప్రసంగించనున్నారు. రాష్ట్రంలోని అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించనున్నారు.
Similar News
News February 20, 2025
పొరపాట్లకు తావులేకుండా రీ సర్వే ప్రక్రియను చేయాలి: కలెక్టర్

రీ సర్వే ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్) ప్రకారం పొరపాట్లకు తావులేకుండా రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేయాలని కలెక్టర్ రెవెన్యూ, సర్వే శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ నిర్వహణపై రెవెన్యూ, సర్వే సిబ్బందికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
News February 19, 2025
గుంటూరులో కర్నూలు జిల్లా వ్యక్తి మృతి

బతుకుదెరువు కోసం వలస వెళ్లిన కర్నూలు జిల్లా వ్యక్తి గుంటూరులో మృతిచెందాడు. అందిన వివరాల మేరకు.. కౌతాళం మండలం సులకేరి గ్రామానికి చెందిన నాగేశ్ (28) జనవరిలో ఉపాధి కోసం వలస వెళ్లారు. ఇవాళ ఉదయం పనులకు పోతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి కింద పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
News February 19, 2025
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు.. ముఖ్యమైన అంశాలు!

● శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
● అన్ని ఆర్జిత సేవలు రద్దు.. ప్రముఖులకు 4విడతలుగా బ్రేక్ దర్శనం
● 22న టీటీడీ తరఫున స్వామి, అమ్మవార్లకు వస్త్రాల అందజేత
● 23న సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ
● కాలినడక భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి
● శివరాత్రి రోజున ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం
● భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం
● ఘాట్‌లో 24గంటల అనుమతి
● 453 స్పెషల్ బస్సులు ఏర్పాటు