News January 22, 2025

దావోస్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రసంగం

image

దావోస్‌లో జరుగుతున్న WEF2025లో CII మరియు PWC బ్రేక్‌ఫాస్ట్ ఇంటరాక్షన్ సందర్భంగా మంథని MLA, మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో అత్యాధునిక టెక్నాలజీలపై దృష్టి పెట్టామన్నారు. నూతనంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, BFSI కన్సార్టియం, ఎక్స్‌లెన్స్ సెంటర్లు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ ఉన్నారు.

Similar News

News November 1, 2025

ఏకాదశి వ్రతం ఎలా పాటించాలి?

image

ఏకాదశి వ్రతం పాటించే భక్తులు ఆ రోజున ఉపవాసం ఉండాలి. విష్ణువును తులసి మాలలతో పూజించాలి. రాత్రంతా పురాణ శ్రవణం చేస్తూ, జాగరణ చేయాలి. మరుసటి రోజు ద్వాదశి ఘడియల్లో మళ్లీ విష్ణు పూజ చేసి, భోజనం స్వీకరించాలి. అలా వ్రతం ముగుస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే నారద పురాణం ప్రకారం.. ధాన్యం, సంపద, ఉన్నత స్థానం లభిస్తాయని నమ్మకం. యజ్ఞయాగాలు, పుణ్యక్షేత్ర దర్శనాల ఫలం కన్నా ఎన్నో రెట్ల అధిక పుణ్యం వస్తుందట.

News November 1, 2025

పొడిబారిన జుట్టుకు పంప్కిన్ మాస్క్

image

తేమ కోల్పోయి నిర్జీవమైన జుట్టును తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావాలంటే గుమ్మడికాయ హెయిర్ ప్యాక్ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఎర్ర గుమ్మడి కాయ ముక్కల్లో కాస్త తేనె వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 3 గంటల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు పట్టులా మృదువుగా మారుతుంది.

News November 1, 2025

కాశీబుగ్గ ప్రమాదంపై శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం

image

కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 10 మంది వరకు చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూంను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. ప్రమాదంపై సమాచారం కొరకు 08942 240557 కంట్రోల్ రూం నంబర్‌ను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు.