News January 22, 2025
దావోస్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రసంగం

దావోస్‌లో జరుగుతున్న WEF2025లో CII మరియు PWC బ్రేక్‌ఫాస్ట్ ఇంటరాక్షన్ సందర్భంగా మంథని MLA, మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో అత్యాధునిక టెక్నాలజీలపై దృష్టి పెట్టామన్నారు. నూతనంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, BFSI కన్సార్టియం, ఎక్స్‌లెన్స్ సెంటర్లు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ ఉన్నారు.
Similar News
News February 8, 2025
ఉదయం టిఫిన్ మానేస్తున్నారా?

బిజీగా ఉండటం వల్లో లేక ఇతరత్రా కారణాలతోనో చాలామంది ఉదయం అల్పాహారం మానేస్తుంటారు. అలా మానడం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల నీరసం, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తడం, రక్తంలో చక్కెర స్థాయుల పెరుగుదల, రోజంతా విపరీతమైన ఆకలి, భావోద్వేగాల ఊగిసలాట, రోగ నిరోధక శక్తి తగ్గుదల వంటి పలు ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. మరి మీరు తింటున్నారా? కామెంట్ చేయండి.
News February 8, 2025
జమ్మలమడుగు: ఆర్టీసీ బస్సులో వ్యక్తి మృతి

జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. కడప జిల్లా మైలవరం మండలం వేపరాలకు చెందిన నాగయ్య(42) తాడిపత్రి నుంచి జమ్మలమడుగు వచ్చేందుకు బస్సు ఎక్కారు. కొలిమిగుండ్ల వద్ద గుండెపోటుకు గురైన ఆయన సీట్లో నుంచి కుప్పకూలి కింద పడ్డారు. అనంతరం ప్రయాణికులు పరిశీలించగా అప్పటికే మృతిచెందారు.
News February 8, 2025
పేరూరు: తల్లి మృతితో పిల్లలు కన్నీరుమున్నీరు

అమలాపురం మండలం పేరూరు కంసాల కాలనీలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లవరం మండలం గుడాలకి చెందిన కవిత నిన్న ఆత్మహత్యకు పాల్పడింది. భర్త సునీల్ నరసాపురంలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు స్కూలుకు వెళ్లాక ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తల్లి మరణించడంతో పిల్లల రోదన స్థానికులను కలిచివేసింది. CI కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.