News September 19, 2024
దాసన్నకే మళ్లీ వైసీపీ పగ్గాలు

వైసీపీ జిల్లా అధ్యక్షునిగా Ex.Dy.CM ధర్మాన కృష్ణదాస్‌ని వైసీపీ అధినేత జగన్ గురువారం నియమించారు. దాసన్న కుటుంబం మొదట్నుంచీ వైఎస్ కుటుంబానికి అత్యంత ఆత్మీయులు, ఆప్తులుగా పేరుపొందారు. పార్టీ ఆవిర్భావం నుంచీ దాసన్న సతీమణి పద్మప్రియ జిల్లా
అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ధర్మాన గత ప్రభుత్వంలో మంత్రిమండలి నుంచి మళ్లీ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు మళ్లీ ఆయనకే పట్టంకట్టారు.
Similar News
News February 28, 2026
‘తాగునీటిలో ‘ఈ-కోలి’.. అందుకే డయేరియా’

శ్రీకాకుళం నగరంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఇదే అతిసార వ్యాప్తికి ప్రధాన కారణమని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీరపాండియన్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఆయన నగరంలోని అతిసార ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.

News February 27, 2026
విశాఖ-పలాస మార్గంలో పలు రైళ్లు రద్దు

విశాఖ-పలాస-బరంపురం మార్గంలో మార్చి 2వ తేదీన పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. విశాఖ-బరంపురం ప్యాసింజర్ (58531/58532), విశాఖ-పలాస మెమూ ప్యాసింజర్ (67289/67290) రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ వెల్లడించారు. సిగడాం, పొందూరు, దూసి పరిధిలో భద్రత పరమైన పనుల నిమిత్తం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.