News September 19, 2024

దాసన్నకే మళ్లీ వైసీపీ పగ్గాలు

image

వైసీపీ జిల్లా అధ్యక్షునిగా Ex.Dy.CM ధర్మాన కృష్ణదాస్‌ని వైసీపీ అధినేత జగన్ గురువారం నియమించారు. దాసన్న కుటుంబం మొదట్నుంచీ వైఎస్ కుటుంబానికి అత్యంత ఆత్మీయులు, ఆప్తులుగా పేరుపొందారు. పార్టీ ఆవిర్భావం నుంచీ దాసన్న సతీమణి పద్మప్రియ జిల్లా
అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ధర్మాన గత ప్రభుత్వంలో మంత్రిమండలి నుంచి మళ్లీ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు మళ్లీ ఆయనకే పట్టంకట్టారు.

Similar News

News October 15, 2024

శ్రీకాకుళం: ‘స్వర్ణాంధ్ర -2047 ఆర్థిక వృద్ధికి పక్కా ప్రణాళిక ఉండాలి’

image

స్వర్ణాంధ్ర-2047 నాటికి ఆర్థిక వృద్ధి రేటు పెంచే దిశగా ప్రణాళికలు ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. సోమవారం స్వర్ణాంధ్ర-2047 పై మండల, జిల్లాల విజన్ ప్లానింగ్ పై జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.

News October 14, 2024

శ్రీకాకుళం జిల్లాలో 158 పేర్లు ఖరారు

image

శ్రీకాకుళంలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కళావేదికలో ప్రారంభమైన మద్యం షాపులు కేటాయింపులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లాటరీ నిర్వహించారు. జిల్లాలో 158 మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో 158 పేర్లు ఖరారు చేసినట్లు వారు పేర్కొన్నారు.

News October 14, 2024

శ్రీకాకుళంలో 113 మద్యం షాపుల పేర్ల ప్రకటన

image

శ్రీకాకుళం నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కళావేదిలో ప్రారంభమైన మద్యం షాపులు కేటాయింపులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి, ఆర్డీవో కె.సాయి ప్రత్యూషలు లాటరీ నిర్వహణ చేపట్టారు. ఇప్పటి వరకు 113 మద్యం షాపుల పేర్లు లాటరీ పద్ధతిలో ప్రకటించినట్లు వారు తెలిపారు.