News March 28, 2025
దిగ్బ్రాంతికి గురైన రామగుండం MLA, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

రామగుండం MLAరాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్, కుమార్తె, అల్లుడు ఇటీవల బ్యాంకాక్ పర్యటనకు వెళ్లారు. ఈరోజు అక్కడ భూకంపం రావడంతో తృటిలో MLA కుటుంబసభ్యులు తప్పించుకున్నారు. విషయం తెలియడంతో MLAతో పాటు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు దిగ్బ్రాంతికి లోనయ్యాయి. HYD నుంచి గోదావరిఖనికి వస్తున్న ఆయన విషయం తెలియడంతో తిరిగి HYDకి వెళ్లారు. కుటుంబసభ్యులు ప్లైట్‌లో బ్యాంకాక్ నుంచి HYDకు తిరుగు పయనమయ్యారు.
Similar News
News November 15, 2025
NLG: కుటుంబానికి ఒక్కటే.. అదీ అందడం లేదు!

జిల్లాలో రేషన్ లబ్ధిదారులకు డీలర్లు సంచులు పంపిణీ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రేషన్ షాపుల పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని సంచుల్లో ఇవ్వాల్సి ఉండగా చాలా గ్రామాలలో లబ్ధిదారులకు అవి పూర్తిస్థాయిలో అందడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ రేషన్ ఇస్తున్నా సంచులు ఇవ్వడం లేదు. అదే విధంగా 6 కిలోలకు ఒక సంచి చొప్పున ఇవ్వాల్సి ఉండగా, కుటుంబానికి ఒకటి చొప్పున డీలర్లు పంపిణీ చేస్తున్నారు.
News November 15, 2025
MBNR: రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీ దుర్మరణం

అడ్డాకుల మండలం రాచాల సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కూలీ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చౌడాయపల్లికి చెందిన మహిళా కూలీలు ఆటోలో వస్తుండగా, ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కూలీ పద్మ(30) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో మహిళ బురమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న వినయ్‌కు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News November 15, 2025
ములుగు జిల్లా పోలీసుల అదుపులో అజాద్, అశోక్!?

మావోయిస్టు పార్టీ భద్రాద్రి కార్యదర్శి ఆజాద్, సి.కా.స ఆర్గనైజర్ అశోక్ ములుగు జిల్లా పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం వీరిని పస్రా వద్ద అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సరెండర్ అయ్యేందుకు వీరిద్దరూ బయటకు రాగా పోలీసులు మాటువేసి పట్టుకున్నట్లు సమాచారం. వీరికి ఎలాంటి హాని తలపెట్టవద్దని, కోర్టు ముందు హాజరు పర్చాలని పౌరహక్కుల సంఘం నాయకులు గడ్డం లక్ష్మణ్, నారాయణరావు డిమాండ్ చేశారు.


