News January 17, 2025
దిలావర్‌పూర్: అటవీ ప్రాంతంలో భార్యాభర్తల SUICIDE

ఇద్దరు భార్యాభర్తలు ఉరేసుకొని మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. సారంగాపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఒకే చెట్టుకు ఉరేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 18, 2025
నిర్మల్: 3 ప్రమాదాలు.. ఐదుగురు మృతి

నిర్మల్ జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. కాగా ఓ అనుమానాస్పద మృతి కేసు నమోదైంది. ఇందులో మూడు ఘటనలు బాసరలో జరగడం గమనార్హం. ఆర్జీయూకేటీ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు చనిపోగా.. అదే ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమైంది. పుష్కరఘాట్ల వద్ద మరొకరు నీటమునిగి చనిపోయారు. సారంగాపూర్ మండలంలో జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు దుర్మరణం చెందారు.
News February 18, 2025
నేనొచ్చాక కూడా అధికారులు రారా..?: కలెక్టర్

ప్రజావాణిలో చాలా మంది అధికారులు తాను వచ్చిన తరువాత కూడా రావడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలుంటాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. సోమవారం ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ వచ్చిన కూడా అధికారులు రాకపోవడం సరైన విధానం కాదన్నారు. తర్వాత గ్రీవెన్స్ వచ్చిన అధికారులు వారికి సంబంధించిన అర్జీలపై కలెక్టర్‌కు వివరణ ఇచ్చారు. ఫిర్యాదు విభాగంలో 69 అర్జీలు స్వీకరించారు.
News February 18, 2025
నేరడిగొండ: ఒకేరోజు 700మంది రక్తదానం

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేరడిగొండలోని తన నివాసం వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరానికి భారీగా స్పందన వచ్చింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వికలాంగులు, అభిమానులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రక్తదానం చేస్తూ ప్రతి ఒక్కరు కేసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరంలో 700 మందికి పైగా రక్తదానం చేశారని పేర్కొన్నారు.