News February 28, 2025

దిలావర్పూర్: ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని జాలరి మృతి

image

ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని ఓ జాలరి మృతి చెందిన ఘటన దిలావర్పూర్ మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ వివరాల మేరకు… కాండ్లి గ్రామానికి చెందిన భోజన్న (59) శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చేపల వలలు చిక్కుకొని మృతి చెందాడని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

Similar News

News November 24, 2025

NLG: ‘TCC పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి’

image

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఎగ్జామ్, లోయర్ అండ్ హయ్యర్ డ్రాయింగ్ అండ్ టైలరింగ్ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.bse.telangana.gov.in ను చూడాలన్నారు. .

News November 24, 2025

మంచిర్యాల: ఓటు వేయడానికి రెడీనా..!

image

మంచిర్యాల జిల్లాలోని గ్రామపంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లను ఈ విధంగా కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 306 గ్రామపంచాయతీలు, 2,680 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు 65, ఎస్సీ 81, బీసీ 23, జనరల్ 137 స్థానాలు కేటాయించారు. డిసెంబర్ రెండో వారంలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు.

News November 24, 2025

పాలమూరు: మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

image

నారయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్‌లోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు నిలిపివేయడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రైతులతో కలిసి ఈ నెల 17న జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. దాదాపు 4గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యేపై అని మాగునూరు పోలీసులు ఆయనతోపాటు బీఆర్ఎస్ నేతలు పలువురిపై కేసు నమోదు చేశారు.