News February 8, 2025
దిలావార్ పూర్: విగ్రహ ప్రతిష్ఠాపన ఏర్పాట్ల బందోబస్తు పరిశీలన

ఈ నెల 8న నిర్వహించనున్న ధ్యాన హనుమాన్ భారీ శిల్ప విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లను అదనపు ఎస్పీలు అవినాష్ కుమార్, ఉపేందర్ రెడ్డిలు శుక్రవారం పరిశీలించారు. విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి వచ్చే భక్తులు వాహనాలు, సౌకర్యాలను తదితర విషయాలను కార్యక్రమా నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News March 21, 2025
సేవా పతకాలకు చిత్తూరు పోలీసులు ఎంపిక

ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు పోలీసులకు పతకాలు వచ్చాయని ఎస్పీ మణికంఠ తెలిపారు. డీఎస్పీ మహబూబ్ బాషా, మనోహర్, మునిరత్నం, దేవరాజుల నాయుడు, వెంకటేశ్వర్లు, సురేష్ కుమార్, నాంతుల్లా, బాలాజీ, హరిబాబు, మణిగండన్‌కు పథకాలు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వారికి ఎస్పీ అభినందనలు తెలిపారు.
News March 21, 2025
సీఎంతో హరీశ్, పద్మారావు భేటీ

TG: అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పద్మారావు భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో 15 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని సీఎంకు వారు ఫిర్యాదు చేశారు.
News March 21, 2025
నటి రజిత ఇంట్లో విషాదం

ప్రముఖ నటి రజిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయలక్ష్మి(76) గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు ఆమె మరణానికి సంతాపం తెలియజేశారు. రజిత 1986 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తెలుగులో దాదాపు 200 చిత్రాల్లో నటించారు.