News April 9, 2025
దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబ్ బ్లాస్ట్‌కు వేరే దగ్గర ప్లాన్

దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్ రాష్ట్రాన్ని వణికించిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదులు ముందుగా స్థానికంగా మిర్చి సెంటర్, మద్యం దుకాణాన్ని టార్గెట్ చేయగా సమయం మించిపోతుండడంతో బాంబుతో సైకిల్‌ని వఖాస్ 107 బస్టాప్ వద్ద వదిలేసి వెళ్లాడు. దీనికి ముందు లుంబినీ పార్క్ వద్ద పేలిన బాంబ్‌ను కూడా హుస్సేన్ సాగర్‌లో షికారు బోటు వద్ద పెట్టాలని ప్లాన్ చేశారు. సమయం మించిపోవడంతో లేజేరియం వద్ద వదిలేసి వెళ్లాడు.
Similar News
News April 21, 2025
సిట్ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి

AP: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన గోవా నుంచి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. కాసేపట్లో విజయవాడకు తరలించనున్నారు. కాగా ఇవాళ సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజ్ కసిరెడ్డి ఈ ఉదయం ఆడియో రిలీజ్ చేశారు.
News April 21, 2025
రేపు ఇంటర్ రిజల్ట్స్.. HYDలో వెయిటింగ్

రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన హైదరాబాద్ జిల్లాలో 244 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 90,351 విద్యార్థులకు 87,523 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 77,495 విద్యార్థులకు 75,083 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం రేపు తేలనుంది. ఇంటర్ ఫలితాలను <<16170006>>Way2Newsలో<<>> చెక్ చేసుకోండి.
SHARE IT
News April 21, 2025
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చిల్పూర్ RI

భూ సర్వే కోసం రూ.26 వేలు లంచం తీసుకుంటూ RI ఏసీబీకి పట్టుబడ్డారు. చిల్పూర్ తహశీల్దార్ కార్యాలయంలో RIగా పనిచేస్తున్న వినయ్ కుమార్ ఓ వ్యక్తి వద్ద భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేశాడు. సోమవారం బాధితుడు రూ.26 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.