News April 8, 2025

దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్ .. నేడే తీర్పు

image

దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించబోతుంది. 2013 FEB 21న జరిగిన ఈ బాంబ్ దాడిలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలవ్వడం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి NIA కోర్టు ఉరిశిక్ష వేయగా, దీనిపై హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పేలుళ్ల ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.

Similar News

News December 20, 2025

టీ20 ప్రపంచకప్‌ జట్టులో మన హైదరాబాదీ

image

భారత్, శ్రీలంక వేదికలుగా జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌నకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ జట్టులో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మకు చోటు దక్కడం విశేషం. పొట్టి ఫార్మాట్‌లో 68 సగటుతో కోహ్లీ రికార్డును దాటేసిన తిలక్ ఎంపికపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది.

News December 20, 2025

HYD: 600 స్పెషల్ ట్రైన్స్‌తో సంక్రాంతికి వస్తున్నాం

image

సంక్రాంతికి ఊరెళుతున్నారా.. ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాలేదని బాధపడుతున్నారా.. అయితే ఇది మీకోసమే.. సంక్రాంతి సందర్భంగా మొత్తం 600 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే CPRO శ్రీధర్ తెలిపారు. నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, చర్లపల్లి, సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లను ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా నడుపుతున్నామన్నారు. ఇప్పటికే 124 రైళ్లు సేవలందిస్తున్నాయని తెలిపారు. మరింకెందుకు ఆలస్యం బుక్ చేసుకోండి మరి.

News December 20, 2025

HYD: డివిజన్ల పేర్ల మార్పుపై సెంటిమెంట్‌కే పెద్దపీట

image

పునర్విభజనలో భాగంగా అధికారులు కొన్ని డివిజన్ల పేర్లను మార్చారు. మరి కొన్ని డివిజన్లు అసలు లేనేలేవు. దీంతో వేలమంది తమ డివిజన్ పేరు మారిస్తే ఎలా? పేరు లేకపోతే ఎలా? అని అభ్యంతరం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన కౌన్సిల్  సమావేశంలోనూ సభ్యులు ఈ విషయం లేవనెత్తారు. దీంతో ప్రజల సెంటిమెంటును గౌరవించి పాతపేర్లనే కొనసాగించనున్నట్లు తెలిసింది.