News September 15, 2024
దివాన్ చెరువు ప్రాంతంలో పులి కదలికలు: FRO భరణి
దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున చిరుతపులి కదలిక చిత్రాలు ట్రాప్ కెమెరాలో రికార్డు అయ్యాయని జిల్లా అటవీ శాఖాధికారిని భరణి తెలిపారు. చిరుత ప్రస్తుతం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో సంచరిస్తుందని చిరుత కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను ఉపయోగిస్తున్నామన్నారు. పులిని ట్రాప్ బోనులతో పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని, దాన్ని కచ్చితంగా పట్టుకుంటామన్నారు.
Similar News
News October 13, 2024
అమలాపురం: ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఎంపికపై సర్వే
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న అంశంపై ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా సర్వే చేపట్టారు. అమలాపురం టీడీపీ యువ నాయకుడు చెరుకూరి సాయిరామ్, ముమ్మిడివరానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్, అమలాపురం టీడీపీ సీనియర్ నాయకుడు రమణబాబు, వాసంశెట్టి వెంకట సత్య ప్రభాకర్, జిల్లాకు చెందిన పలువురు నాయకులు పేర్లపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.
News October 12, 2024
కాకినాడ జిల్లాలో రావణ దేవాలయాన్ని చూశారా..!
లంకాధిపతి రావణాసురుడి దేవాలయం మన కాకినాడ రూరల్ సాగర తీరాన ఉంది. దసరా వేళ పలు ప్రాంతాల్లో రావణ దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో రావణాసురుని పూజించటం మరో విశేషం. దీన్ని కుంభాభిషేకం గుడి అని కూడా పిలుస్తారు. ఆయన ఆది కుంభేశ్వరుడిగా ఇక్కడ పూజలు అందుకుంటారు.
News October 12, 2024
రాజమండ్రి: దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల
రాష్ట్ర ప్రజలకు మంత్రి కందులు దుర్గేష్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలోని క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చెడుపై చివరికి మంచే గెలుస్తుందని గుర్తుచేసే రోజు విజయదశమి అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.