News April 2, 2025
దివావకరపల్లిలో మంత్రి నారా లోకేశ్ పర్యటన సాగేదిలా

పెదచెర్లపల్లి మండలం దివాకరపల్లిలో మంత్రి నారా లోకేశ్ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్కు నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఉదయం 7:15 నిమిషాలకు ఉండవల్లి నుంచి బయలుదేరుతారు. 9:15కు దివాకరపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9: 25 నిమిషాలకు బయోగ్యాస్ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 11:45 వరకు సభలో పాల్గొంటారు. 11:55 నిమిషాలకు అక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు.
Similar News
News April 4, 2025
మార్కాపురంలో యువకుడు ఆత్మహత్య

మార్కాపురం కాలేజీ రోడ్డులోని జాకీ షోరూమ్ లో పనిచేస్తున్న మహేశ్ అనే యువకుడు గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆళ్లగడ్డకు చెందిన మహేశ్ జీవనోపాధి కోసం కొంతకాలం క్రితం మార్కాపురం వచ్చాడని స్థానికులు తెలిపారు. నమ్మిన వారందరూ మోసం చేశారని జీవితం మీద విరక్తితో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News April 4, 2025
చీమకుర్తి : ముగ్గురి మృతికి కారణమైన వ్యక్తికి జైలు

చీమకుర్తి – గంగవరం రోడ్డు రచ్చమిట్ట సెంటర్ వద్ద 2019లో లారీ ఢీ కొని బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు మృతిచెందారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. నిర్లక్ష్యంగా లారీ నడిపి ముగ్గురి మృతికి కారణమయ్యాడని నేర నిరూపణైంది. దీంతో ఎక్సైజ్ కోర్ట్ జడ్జి కోమలవల్లి నిందితుడికి 2 ఏళ్ల 3 నెలలు జైలు శిక్ష, రూ. 5,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
News April 4, 2025
టంగుటూరులో కారు ఢీకొని ఒకరి మృతి

టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో కారు ఢీ కొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మృతి చెందాడు. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని కారు ఢీ కొనటంతో అతని తలకు బలమైన గాయాలై చనిపోయాడు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పెట్రోలింగ్ పోలీసులు టంగుటూరు ఎస్సైకు సమాచారం అందించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.