News December 21, 2024

దివ్యాంగురాలితో ప్రేమ వివాహం.. ఆటో డ్రైవర్ గొప్ప మనసు..!

image

ఆటో డ్రైవర్ గొప్ప మనసు చాటుకున్నాడు. దివ్యాంగురాలిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. సీ.బెళగల్(మం) పొనకల్‌కు చెందిన దివ్యాంగురాలు వెంకటేశ్వరమ్మ, గూడూరు(మం) సంగాలకు చెందిన ఆటో డ్రైవర్ మద్దిలేటి ప్రేమించుకున్నారు. నందవరం(మం) గురజాలలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దివ్యాంగుల సాధికారత ఫోరం JAC అధ్యక్షుడు నాగరాజు సమక్షంలో శనివారం పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు.

Similar News

News December 22, 2024

రోడ్డు ప్రమాదంలో నర్సు మృతి

image

దోర్నాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీశైల దేవస్థానం వైద్యశాల నర్సు మల్లిక మృతి చెందారు. శ్రీశైలానికి చెందిన ఆమె.. భర్త, పాపతో కలిసి కర్నూలుకు షాపింగ్ నిమిత్తం నిన్న వెళ్లారు. రాత్రి పుష్ప-2 సినిమా చూసి, తిరుగు పయనమయ్యారు. తెల్లవారుజామున మంచు కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు టూరిస్ట్ బస్సును ఢీకొంది. మల్లిక అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త, పాపకు ఏమీ కాలేదని వారి సన్నిహితులు తెలిపారు.

News December 22, 2024

కర్నూలు: క్లాస్‌రూములో ఉండగానే టీచర్‌ కిడ్నాప్‌..?

image

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మునీర్ అహ్మద్ కిడ్నాప్ అయినట్టు తెలుస్తోంది. క్లాస్ రూములో ఉండగానే కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మునీర్ అహ్మద్ కిడ్నాప్ కావడం ఇది మూడోసారి అని, కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనుక రూ.20 కోట్లు విలువ చేసే భూ వివాదంలో కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. మునీర్ అహ్మద్ సోదరుడు మక్బూల్ బాషా కూడా కనిపించడం లేదని అంటున్నారు.

News December 22, 2024

గుండెపోటుతో పాత్రికేయుడి మృతి

image

గడివేముల మండల విలేకరి మహబూబ్ బాషా గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. 4 రోజుల నుంచి అస్వస్థతతో చికిత్స తీసుకుని కోలుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ‘Iam Back’ అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టారు. అయితే నేడు అకాల మరణంతో కుటుంబ సభ్యులు, తోటి విలేకరులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈయన APUWJ సభ్యుడిగా పాత్రికేయ
రంగానికే వన్నెతెచ్చిన వ్యక్తిగా పేరు గడించారని పలువురు విలేకరులు కొనియాడారు.