News March 12, 2025
దివ్యాంగులకు కార్డుల జారీపై అపోహలొద్దు: కలెక్టర్

దివ్యాంగులకు యూనిక్ డిసెబిలిటీ ఐడీ కార్డుల జారీపై ఎటువంటి అపోహలు వద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో దివ్యాంగులకు, మీసేవా కేంద్ర నిర్వాహకులకు యూనిక్ డిసెబిలిటీ ఐడీ కార్డుల జారీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు కార్డుల జారీపై అపోహలను నివృత్తి చేయడం కోసమే ఈ సదస్సు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 5, 2025
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: ఎస్పీ

ప్రొద్దుటూరులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 6 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ, పదుల సంఖ్యలో ఫేక్ కరెంట్ బ్యాంక్ అకౌంట్లు తెరిచి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ఈ ముఠా నుంచి రూ.6.28 లక్షల నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
News November 5, 2025
పోషకాహారాన్ని సకాలంలో అందించాలి: VZM JC

జిల్లాలోని 2,499 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పోషకాహారం సకాలంలో అందేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేథుమాధవన్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. సరుకుల సరఫరాలో జాప్యం లేకుండా, నాణ్యమైన బియ్యం, పప్పు, నూనె అందించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ డైరెక్టర్ విమల రాణి, సివిల్ సప్లయిస్ డీఎం శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News November 5, 2025
రబీలో రాగులు(రాగి) సాగు – అనువైన రకాలు

రబీలో రాగి పంటను నవంబర్-డిసెంబర్ నెలల్లో విత్తుకోవచ్చు.తేలిక రకం ఇసుక నేలలు, బరువు నేలల్లో విత్తుకోవచ్చు. నీరు నిల్వ ఉండే భూములు అనుకూలం కాదు. గోదావరి, రత్నగిరి, సప్తగిరి, మారుతి, చంపావతి, భారతి, శ్రీచైతన్య, వకుళ, హిమ, తిరుమల, వేగవతి, సువర్ణముఖి, గౌతమి, ఇంద్రావతి వంటి రకాలు ఖరీఫ్, రబీకి అనువైన రాగి పంట రకాలు. ఎకరాకు నారుకోసం 2.5 కిలోల విత్తనం, వెదజల్లే పద్ధతిలో ఎకరాకు 3-4 కిలోల విత్తనం అవసరం.


