News November 4, 2024
దివ్యాంగులు పెట్రోల్ సబ్సిడీకి దరఖాస్తు చేసుకోండి

చిత్తూరు జిల్లాలోని దివ్యాంగుల మూడు చక్రాల వాహనాలకు సబ్సిడీ పెట్రోల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సోమవారం విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు ఏ.వై శ్రీనివాసులు కోరారు. గుర్తింపు కలిగిన ప్రైవేటు సంస్థలలో పనిచేస్తూ సొంత మూడు చక్రాల మోటారు వాహనాలు గల దివ్యాంగుల నుంచి పెట్రోల్, డీజిల్ రాయితీ కోసం ఈనెల నవంబర్ 15 లోగా దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లు జతపరచాలన్నారు.
Similar News
News December 1, 2025
చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా..!

చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు కురిసిన వర్షపాత వివరాలను అధికారులు వెల్లడించారు. సోమలలో అత్యధికంగా 22 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా గుడిపాలలో 2.4 మి.మీ పడింది. కార్వేటినగరంలో 19. 2, పులిచెర్లలో 15.8, విజయపురంలో 15.4, రొంపిచర్లలో 14.8, సదుంలో 13, వెదురుకుప్పంలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
News December 1, 2025
6న చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం

చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరులోని ఆయా శాఖల జిల్లా అధికారులు అజెండా నివేదికలను అందజేయాలని సూచించారు.
News December 1, 2025
చిత్తూరు జిల్లాలో తగ్గుతున్న హెచ్ఐవీ కేసులు

చిత్తూరు జిల్లాలో హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలో 2023-24లో 0.5 శాతం ఉన్న హెచ్ఐవీ వ్యాప్తి.. 2024-25 నాటికి అదే శాతం ఉంది. 2025-26లో 0.36 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 47,454 మందిని పరీక్షించగా.. 168 మందికి పాజిటివ్గా తేలింది. అలాగే 22,430 మంది గర్భిణులను పరీక్షించగా, వీరిలో 5మందికి హెచ్ఐవీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.


