News March 6, 2025

దివ్యాంగుల కోసం హెల్ప్ డెస్క్: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో దివ్యాంగులకు హక్కులపై అవగాహన కల్పించి, ప్రభుత్వ పథకాల లబ్ధిచేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం తెలిపారు. యూ.డి.ఐ.డి కార్డు పొందే విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి మండల కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Similar News

News October 16, 2025

విద్యార్థులకు వ్యాస రచన పోటీలు: ఖమ్మం సీపీ

image

పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పోటీల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 భాషల్లో 6వ తరగతి నుంచి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు https://forms.gle/jaWLdt2yhNrMpe3eA లో మీ పేరు, విద్యార్హత, ఇతర వివరాలు నమోదు చేయాలని సూచించారు.

News October 16, 2025

ఖమ్మం: పెండింగ్‌ ఓటర్ల దరఖాస్తులు పరిష్కరించాలి

image

ఓటరు జాబితా, బూత్ స్థాయి అధికారుల నియామకంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఏడు రోజుల్లోగా పరిష్కరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. బీఎల్‌ఓలకు గుర్తింపు కార్డులు, నూతన ఓటర్లకు ఐడీ కార్డులను త్వరగా పంపిణీ చేయాలని సీఈవో సూచించారు.

News October 16, 2025

టీటీడీ ఆలయానికి 20 ఎకరాల గుర్తింపు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి స్థల అప్పగింత చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, తెలంగాణ దేవాదాయ శాఖ స్థపతి ఎన్.వాళ్లినాయగం, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డిలతో కలిసి సమీక్షించారు. అల్లీపురం వద్ద 20 ఎకరాల స్థలం గుర్తించి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.