News November 28, 2024
దివ్యాంగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క
హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగులు పట్టుదలతో ఉండి, అనుకున్నది సాధించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని తెలియజేశారు.
Similar News
News December 14, 2024
వరంగల్: విషాదం.. రేపు పెళ్లి.. వరుడి తల్లి మృతి
గుండెపోటుతో మహిళ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. WGL కాశిబుగ్గకు చెందిన గుర్రపు రజిని- సమ్మయ్య దంపతుల కుమారుడి వివాహం ఆదివారం జరగనుంది. కాగా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న రజినికి శనివారం తెల్లవారుజామున ఆకస్మికంగా గుండెపోటు వచ్చి తనువు చాలించింది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.
News December 14, 2024
HNK: త్వరలో జూపార్క్‌కు తెల్లపులులు, సింహం
హంటర్ రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్క్‌కు త్వరలో మరిన్ని జంతువులు రానున్నాయి. సింహంతో పాటు రెండు తెల్లపులులను తెప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జూ పార్క్‌కు రెండు పులులు కరీనా, శంకర్ వచ్చాయని, త్వరలో రెండు అటవీ దున్నలు(బైసన్‌లు) రానున్నట్లు భద్రాద్రి జోన్ సీపీఎఫ్ భీమానాయక్ చెప్పారు. వచ్చే ఏడాది మరిన్ని జంతువులు జూపార్క్‌కు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
News December 14, 2024
కొమరవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం లెక్కించారు. స్వామి వారికి 73 రోజుల్లో రూ.81,68,044 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 146 గ్రాముల మిశ్రమ బంగారం, 5 కిలోల 200 గ్రాముల మిశ్రమ వెండి, 26 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 550 కేజీలు వచ్చాయన్నారు.